Mon Feb 02 2026 03:35:59 GMT+0000 (Coordinated Universal Time)
వారికి జగన్ భారీ హామీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టించి ఇస్తామని ఆ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్రలో ఉన్న జగన్ ను ఏపీయూడబ్లూజే నేతలు కలిశారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను జగన్ దృష్టికి తీసుకువచ్చారు. దీనికి స్పందించిన జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. జగన్ హామీపై ఏపీయూడబ్లూజే నేతలు హర్షం వ్యక్తం చేశారు. రేపు వైసీపీ తలపెట్టిన రాష్ట్ర బంద్ కు మద్దతిస్తున్నట్లు ఏపీయూడబ్లూజీ నేతలు ప్రకటించారు.
Next Story

