Thu Mar 19 2026 12:05:18 GMT+0530 (India Standard Time)
వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు

విశాఖపట్నం జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పలువురు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. మంగళవారం ఉదయం రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రేమ్ బాబు జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. మరికొంద టీడీపీ నేతలు సైతం వైఎస్సార్సీపీ గూటికి చేరారు. ఇక విశాఖపట్నం మున్సిపల్ ఉద్యోగుల సంఘం సెక్రటరీ జనరల్ గా కార్మికవర్గాల్లో మంచి పట్టు ఉన్న వి.వి.వామనరావు కూడా వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించారు.
Next Story

