Tue Feb 03 2026 00:34:46 GMT+0000 (Coordinated Universal Time)
ఈ బీచ్ కు వెళ్లారంటే...ఇక అంతే....!

ముంబయ్ జూహు బీచ్ లో విషపూరితమైన బ్లా బాటిల్ జెల్లీ ఫిష్ లు కలకలం సృష్టిస్తున్నాయి. బీచ్ కు వచ్చే పర్యాటకులను ఇవి కరవడంతో రెండు రోజుల్లోనే సుమారు 150 మంది గాయపడ్డారు. అయితే, వీటి విషం వల్ల చేపలు మాత్రమే చనిపోతాయని, మనుషులకు ఏమీ ప్రమాదం ఉండదని వైద్యులు, అధికారులు చెబుతున్నారు. కానీ, జెల్లీ ఫిష్ కరిస్తే కొన్ని గంటల పాటు తీవ్ర నొప్పి ఉంటుంది. అయితే, వీటి సంచారం బీచ్ లో ఎక్కువైనందున కొన్ని రోజుల పాటు ప్రజలు ఎవరూ బీచ్ కి రావద్దని అధికారులు ముంబైకర్లను కోరారు.
Next Story

