Wed Mar 25 2026 22:01:16 GMT+0530 (India Standard Time)
జేడీ....జేపీ పార్టీకే సారథ్యమా...?

సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ కొత్త పార్టీని ప్రకటించబోతున్నారని వార్తలొచ్చాయి. అయితే ఆయన కొత్త పార్టీ పెట్టేకంటే ఉన్న పార్టీతోనే ప్రజల ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. లోక్ సత్తా అధ్యక్షుడిగా తాను బాధ్యతలను స్వీకరించి పార్టీని ముందుకు తీసుకెళ్లి వచ్చే ఎన్నికల్లో ఏపీలో పోటీ చేయాలన్నది లక్ష్మీనారాయణ ఉద్దేశ్యంగా కన్పిస్తోంది. ఈ మేరకు జయప్రకాశ్ నారాయణతో ఆయన చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈరోజు మరికాసేపట్లో పబ్లిక్ గార్డెన్స్ లో ప్రారంభం కానున్న సమావేశంలో దీనిపై స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. ఆయన పార్టీ పేరు జనధ్వని గా కూడా ప్రచారం జరిగింది.
Next Story

