ఆయనకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన పవన్ ...?

సిబిఐ మాజీ డైరెక్టర్ జెడి లక్ష్మీనారాయణకు జనసేన అధినేత కౌంటర్ విసిరారా ? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవల జెడి లక్ష్మీనారాయణ ఉత్తరాంధ్ర పర్యటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యువత ప్రశ్నించడమే కాదు సమస్యకు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇది జనసేన ను ఉద్దేశించే ఆయన మాట్లాడారని సోషల్ మీడియా లో పెద్దఎత్తునే ప్రచారం సాగింది. జనసేన సిద్ధాంతం ప్రశ్నించడమే అని పవన్ ప్రతిసారి చెప్పేవారు. దీనికి ఘాటుగా కౌంటర్ ఇవ్వడానికే బాధ్యత తీసుకోవాలని మాజీ జెడి నోటి నుంచి వచ్చిందని అంటున్నారు.
బాధ్యత తీసుకుంటామన్న పవన్ ...
ప్రజల సమస్యలు తెలుసుకోవడమే కాదు, వాటి పరిష్కారాలను బాధ్యతగా తీసుకుంటామని మాజీ జెడి కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు జనసేనాని. మాజీ జెడి లేవనెత్తిన అంశాలు పరిశీలించిన పవన్ అందుకే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ చేసే ప్రతి వ్యాఖ్య వెనుక చాలా అర్ధాలు వుంటాయని సన్నిహితుల టాక్. రాజకీయంగా జనసేనను తొక్కేయడానికి అన్ని వైపులా ముప్పేట దాడిచేస్తారని గుర్తించి ముందు చూపుతో పొలిటికల్ గేమ్ మొదలు పెట్టేసినట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర నుంచి పవన్ తన ప్రత్యర్థులను ఏ మాత్రం ఉపేక్షించని రీతిలో తన ప్రసంగాల ద్వారా చుక్కలు చూపిస్తున్నారని జన సైన్యం భావిస్తుంది . తమ నేత ట్వీట్లు తోనే కాకుండా ప్రజా క్షేత్రంలో పోరాటానికి దిగడంతో సంబరపడుతున్నారు ఆయన ఫ్యాన్స్.
