Fri Mar 27 2026 06:02:22 GMT+0530 (India Standard Time)
రివ్యూ చేసుకోవాలన్న జేసీ

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఎన్నికల్లో విస్పష్ట ఫలితం రావడానికి కారణం అక్కడ రైతులు కేసీఆర్ కు అండగా నిలబడటం వల్లనేనని ఆయన అభిప్రాయపడ్డారు. సంచులు, పంచ్ లతో ఉపయోగం ఉండదని గుర్తుంచుకోవాలన్నారు. రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపడితే ఎవరైనా తిరిగి అధికారంలోకి రావచ్చని కేసీఆర్ నిరూపించారన్నారు. అదే సందర్భంలో కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ లో వేలు పెట్టాలని తాము కోరుకుంటున్నామన్నారు. ఆయన ఏపీరాజకీయాల్లో జోక్యం చేసుకుంటే తమకే ప్రయోజనమని జేసీ దివాకర్ రెడ్డి జోస్యంచెప్పారు.
- Tags
- cpi
- indian national congress
- J.C.Divakar reddy
- k.chandrasekharrao
- kodandaram
- Nara Chandrababunaidu
- prajakutami
- telangana elections
- telangana janasamithi
- telangana rashtra samithi
- telugudesam party
- ts politics
- uttam kumar reddy
- ఉత్తమ్ కుమార్ రెడ్డి
- ఎన్టీ రామారావు
- కె. చంద్రశేఖర్ రావు
- కోదండరామ్
- జేసి దివాకర్ రెడ్డి
- టీఎస్ పాలిటిక్స్
- తెలంగాణ ఎన్నికలు
- తెలంగాణ జనసమితి
- తెలంగాణ రాష్ట్ర సమితి
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- ప్రజాకూటమి
- భారత జాతీయ కాంగ్రెస్
- సీపీఐ
Next Story

