Sun Mar 22 2026 23:12:43 GMT+0530 (India Standard Time)
కలసి పనిచేస్తేనే మున్సిపల్ ఎన్నికలలో గెలుస్తాం
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ నేతలందరూ కలసి పనిచేస్తేనే గెలవగలమని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. లేకుంటే పంచాయతీ ఎన్నికల ఫలితాలు రిపీట్ [more]
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ నేతలందరూ కలసి పనిచేస్తేనే గెలవగలమని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. లేకుంటే పంచాయతీ ఎన్నికల ఫలితాలు రిపీట్ [more]

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ నేతలందరూ కలసి పనిచేస్తేనే గెలవగలమని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. లేకుంటే పంచాయతీ ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో అందరిని భయభ్రాంతులకు గురి చేసి నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. కుప్పం నియోజకవర్గంలోనే వైసీపీ నేతలు అరాచకాలకు పాల్పడ్డారని చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థను పూర్తిగా తొలగిస్తేనే ఎన్నికలు సజావుగా జరుగుతాయని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.
Next Story