Sun Mar 15 2026 14:33:34 GMT+0530 (India Standard Time)
మున్సిపల్ కార్యాలయంలో జేసీ ఆందోళన
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళనకు దిగారు. మున్సిపల్ కార్యాలయంలోనే ఆయన ఆందోళనకు దిగారు. కౌన్సిలర్లతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి మున్సిపల్ కమిషనర్ [more]
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళనకు దిగారు. మున్సిపల్ కార్యాలయంలోనే ఆయన ఆందోళనకు దిగారు. కౌన్సిలర్లతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి మున్సిపల్ కమిషనర్ [more]

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళనకు దిగారు. మున్సిపల్ కార్యాలయంలోనే ఆయన ఆందోళనకు దిగారు. కౌన్సిలర్లతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి మున్సిపల్ కమిషనర్ తో పాటు సిబ్బంది కూడా గైర్హాజరయ్యారు. దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తమకు సహకరించకుండా అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కమిషనర్ వచ్చేంత వరకూ తాను మున్సిపల్ కార్యాలయంలోనే ఉంటానని చెబుతున్నారు. రాత్రి బస కోసం కూడా ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
Next Story