Sun Mar 15 2026 16:13:36 GMT+0530 (India Standard Time)
అవసరమైతే జగన్ ను కలుస్తా… జేసీ ప్రభాకర్ రెడ్డి
తాడిపత్రి అభివృద్ధి కోసం అవసరమైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలుస్తానని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సేవ్ తాడిపత్రి నినాదంతోనే ముందుకు వెళతానని [more]
తాడిపత్రి అభివృద్ధి కోసం అవసరమైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలుస్తానని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సేవ్ తాడిపత్రి నినాదంతోనే ముందుకు వెళతానని [more]

తాడిపత్రి అభివృద్ధి కోసం అవసరమైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలుస్తానని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సేవ్ తాడిపత్రి నినాదంతోనే ముందుకు వెళతానని చెప్పారు. రాష్ట్రంలోనే నెంబర్ వన్ మున్సిపాలిటీగా తాడిపత్రిని తీర్చిదిద్దుతానని ఆయన చెప్పారు. మున్సిపల్ ఛైర్మన్ గా ఎన్నికయిన అనంతరం జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అధికారులంతా న్యాయబద్దంగా పనిచేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తనను గెలిపించిన తాడిపత్రి ప్రజలకు ఆయన మరోసారి ధన్యవాదాలు తెలిపారు.
Next Story