Mon Mar 16 2026 11:39:38 GMT+0530 (India Standard Time)
ఓటుకు రూ.2 వేలిచ్చాం: జేసీ
తాము మొన్నటి ఎన్నికల్లో ఓటుకు రెండు వేలు ఇచ్చామని అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం అమరావతిలో ఆయన మీడియాతో [more]
తాము మొన్నటి ఎన్నికల్లో ఓటుకు రెండు వేలు ఇచ్చామని అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం అమరావతిలో ఆయన మీడియాతో [more]

తాము మొన్నటి ఎన్నికల్లో ఓటుకు రెండు వేలు ఇచ్చామని అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… తమ నియోజకవర్గంలో రూ.50 కోట్లు ఖర్చయిందని, తామే కాకుండా ప్రత్యర్థులు కూడా అంతే డబ్బు ఖర్చు పెట్టారని పేర్కొన్నారు. తాము వెళ్లి ప్రజలను ఓటు అడిగితే రూ.2 వేలు అడుగుతున్నారని పేర్కొన్నారు. కూలీ చేసుకునే వాళ్లు కూడా ఓటుకు 5 వేలు అడుగుతున్నారని అన్నారు. ఇప్పుడే ఓటుకు 2 వేలు ఇస్తే వచ్చే ఎన్నికల్లో ఎంత ఇవ్వాలనే ఆందోళన ఉందన్నారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం తాను కూడా పనిచేస్తానని పేర్కొన్నారు.
Next Story