Mon Mar 23 2026 09:02:24 GMT+0530 (India Standard Time)
టీడీపీపై జేసీ హాట్ కామెంట్స్

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సొంత పార్టీ తెలుగుదేశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీలోని 40 శాతం మంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఆయన స్పష్టం చేశారు. వారిని మారిస్తే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని జోస్యం చెప్పారు. భిన్న దృవాలైన జగన్ - పవన్ కలిసే అవకాశం లేదని పేర్కొన్నారు. జగన్, పవన్ ఇద్దరూ వారు పోటీ చేసిన స్థానాల్లో మాత్రమే గెలవగలరని, కానీ వారి పార్టీల అభ్యర్థును గెలిపించలేరని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, జగన్ ఇద్దరి మనస్తత్వాలు ఒక్కటేనని, పాత కక్షలు మనస్సులో పెట్టుకుని మోదీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
Next Story

