Sun Mar 22 2026 18:36:31 GMT+0530 (India Standard Time)
చంద్రబాబు దగ్గర ప్రింటింగ్ మిషన్ ఉందా..?

చిల్లి గవ్వ లేకుండా రాష్ట్రానికి వచ్చినా... మోదీ ఒక్క రూపాయి ఇవ్వకున్నా చంద్రబాబు నాయుడు అనేక ప్రాజెక్టులు కడుతున్నారని... అనేక పథకాలు అమలు చేస్తున్నారని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రశంసించారు. అసలు చంద్రబాబు వద్ద ఏమి మాయ ఉందో అర్థం కావడం లేదని, ఆయన వద్ద ప్రత్యేకంగా ఆంధ్రా కోసం ఏమైనా డబ్బుల ప్రింటింగ్ మిషన్ ఉందా లేదా అక్షయ పాత్ర ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. పోలవరానికి అసలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కావడం లేదన్నారు. ఇన్ని ప్రాజెక్టులు ఎలా పూర్తి చేస్తున్నారో తెలియడం లేదని, అనంతపురం జిల్లాకు ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి ఖర్చు చేయనంత నిధులను చంద్రబాబు ఖర్చు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. భూమి ఉండే వరకు నీరు ఇచ్చే అంతటి మహానుబావుడు చంద్రబాబు మాత్రమే అని కీర్తించారు.
Next Story

