Tue Mar 24 2026 03:41:18 GMT+0530 (India Standard Time)
జగన్ పై జేసీ తీవ్ర వ్యాఖ్యలు

కడప జిల్లా ప్రజలు రెడ్డి అనే తోక ఉన్నందుకు వై.ఎస్. జగన్ కు ఓటేస్తున్నారని, దయచేసి తోక చూసి ఓటేయవద్దని, చంద్రబాబుకు ఓటేయాలని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కోరారు. జగన్ ఏనాడైనా గండికోట ద్వారా నీరు ఇచ్చేందుకు ఏమైనా ప్రయత్నం చేశాడా అని ప్రశ్నించారు. అన్ని సామాజకవర్గాల వారికి చంద్రబాబు నీళ్లు ఇస్తున్నారని, భూమి ఉన్నన్ని రోజులు చంద్రబాబును ప్రజలు గుర్తు పెట్టుకుంటారని ప్రశ్నించారు. మరో ఐదేళ్లు చంద్రబాబు అధికారంలో ఉంటే రాయలసీమ పచ్చగా మారిపోతుందని, రెడ్డి అనేక తోక చూడకుండా చంద్రబాబుకు ఓటేయాలని దండం పెట్టారు. మీ నాయన చచ్చి పదేళ్లవుతున్నా ఇంకా ఆయన బొమ్మ పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నావని జేసీ ప్రశ్నించారు.
Next Story

