Sat Mar 28 2026 13:53:49 GMT+0530 (India Standard Time)
జేసీ....జగన్ కు ఫేవర్ గానా...??

తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో చెప్పడం కష్టం. అయితే ఆయన తాజా ప్రకటన తెలుగుదేశం పార్టీలోనే కలకలం రేపుతోంది. ఆయన ఈరోజు అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ జగన్ 25 ఎంపీ సీట్లు ఇవ్వాలని ప్రజలను కోరడంలో తప్పులేదన్నారు. జగన్ కు ఆ 25 ఎంపీ సీట్లను ఇవ్వాల్సిందేనన్నారు. లేకుంటే జగన్ ఇంటికి వెళతారన్నారు. జగన్ కు 25 ఎంపీసీట్లు ఇస్తే సంతోషమేనని జేసీ చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అయోమయంలోకి నెట్టేశాయి. జేసీ ఎప్పుడు మీడియాముందుకు వచ్చినా జగన్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారు. అయితే ఈసారి వెరైటీగా వెటకారంగా అన్నారా? సీరియస్ గానే జగన్ కు 25 ఎంపీస్థానాలు వస్తే సంతోషమని ప్రకటించారా? అన్నది జేసీయేచెప్పాల్సి ఉంది.
Next Story

