Sun Mar 08 2026 00:16:58 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఈనెల 4నుంచి ఆమరణ దీక్ష .. జేసీ సంచలన ప్రకటన
తమపై అక్రమంగా నమోదవుతున్న కేసులకు నిరసనగా ఈ నెల 4వ తేదీ నుంచి ఆమరణ దీక్ష చేపడుతున్నట్లు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రకటించారు. తాడిపత్రిలోనే [more]
తమపై అక్రమంగా నమోదవుతున్న కేసులకు నిరసనగా ఈ నెల 4వ తేదీ నుంచి ఆమరణ దీక్ష చేపడుతున్నట్లు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రకటించారు. తాడిపత్రిలోనే [more]

తమపై అక్రమంగా నమోదవుతున్న కేసులకు నిరసనగా ఈ నెల 4వ తేదీ నుంచి ఆమరణ దీక్ష చేపడుతున్నట్లు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రకటించారు. తాడిపత్రిలోనే తాము నిరసన దీక్షకు దిగుతామని చెప్పారు. రెండేళ్ల క్రితం ప్రభోదానంద ఆశ్రమంపై కేసులను ఇప్పుడు వాడుకుంటున్నారని జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. కేసులు నమోదు చేసి లోపల వేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. అమరావతి కోసం కూడా తాను ఆమరణ దీక్ష చేయడానికి రెడీ గా ఉన్నానన్నారు. శ్రీకాకుళం, విశాఖ తప్పించి అన్ని ప్రాంతాల ప్రజలు అమరావతిని కోరుకుంటున్నారని తెలిపారు. ప్రధాని దీనిపై జోక్యం చేసుకోవాలని జేసీ దివాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.
Next Story