Sat Mar 21 2026 17:10:18 GMT+0530 (India Standard Time)
నేను భయపడ్డా.. ఎన్నికల్లో పోటీ చేయను
తాను భయపడ్డానని..అందుకనే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. తన మీద కేసు పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. స్థానిక [more]
తాను భయపడ్డానని..అందుకనే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. తన మీద కేసు పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. స్థానిక [more]

తాను భయపడ్డానని..అందుకనే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. తన మీద కేసు పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో తెచ్చిన కొత్త చట్టం ఒక్క వైసీపీకి తప్ప ఎవరికీ ఉపయోగపడదన్నారు. ఎన్నికల్లో డబ్బులు పంచితే కేసులు పెట్టవచ్చు కాని, ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా కేసులేంటి? అని జేసీ దివాకర్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబుకు ఇప్పటికీ కొందరు నిజాలు చెప్పడం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మా వాడు జగన్ మాత్రమే గెలుస్తాడన్నారు. ఎవరేమనుకున్నా తాము ఎన్నికల్లో పోటీ చేయడం లేదని జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు.
Next Story