Mon Mar 23 2026 16:21:03 GMT+0530 (India Standard Time)
జేసీ కామెంట్స్ చంద్రబాబు వింటే...?

పోలవరం పూర్తి కాదని తాను ఎప్పుడో సీఎం చంద్రబాబుకు చెప్పానని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని జేసీ జోస్యం చెప్పారు. జగన్ తల్లి గర్భం నుంచే సీఎం...సీఎం అంటూ పుట్టారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్, చిరంజీవి ఇద్దరూ ఒకటేనని తెలిపారు. ఉద్యోగులు చంద్రబాబు సర్కార్ పై ఆగ్రహంతో ఉన్నారన్నారు. పీఆర్సీ అమలు చేయకపోవడం, బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయడం వల్ల ఉద్యోగులు ప్రభుత్వంపై పీకల దాకా కోపంతో ఉన్నట్లు జేసీ వ్యాఖ్యానించారు. మోడీకి గవర్నర్ అత్యంత సన్నిహితుడని తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు.
Next Story

