Tue Mar 24 2026 07:31:20 GMT+0530 (India Standard Time)
జగన్ కు జేసీ సవాల్ అదిరిందే....!

వైసీపీ అధినేత జగన్ కు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సవాల్ విసిరారు. ఆ ఇద్దరు ఎంపీల చేత కూడా రాజీనామ చేయిస్తే...తామందరం రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అవసరమైతే తమ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలను కూడా బేఖాతరు చేసి రాజీనామా చేస్తామని చెప్పారు. వైసీపీ ఎంపీలు ఐదుగురు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేత కూడా రాజీనామా చేయిస్తే తామంతా మూకుమ్మడి రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. జగన్ రాజీనామాలతో డ్రామాలాడుతున్నారన్నారు. ఐదుగురు ఎంపీల్లో ముగ్గురి ఆమరణ దీక్ష ముగిసిందని, మరో ఇద్దరి దీక్ష కూడా త్వరలో ముగిసిపోతుందని ఎద్దేవా చేశారు. ఎంపీల రాజీనామాలను దమ్ముంటే జగన్ ఆమోదింప చేసుకోవలని సవాల్ విసిరారు జేసి.
Next Story

