Sun Mar 22 2026 09:33:17 GMT+0530 (India Standard Time)
జేసీకి ఎదురుదెబ్బ...వైసీపీలోకి...?

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రధాన అనుచరుడు, అనంతపురం నగరానికి చెందిన నేత కొగటం విజయ భాస్కరరెడ్డి వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతపురం నుంచి పెద్ద సంఖ్యలో అనుచరులతో ర్యాలీగా బయలుదేరిన ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలోని గోపాలపురంలో జరుగుతున్న జగన్ పాదయాత్ర వద్దకు వెళ్లారు. వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ విజయభాస్కరరెడ్డికి, ఆయన అనుచరులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దివాకరరెడ్డికి అనుచరుడైన విజయభాస్కరరెడ్డి అనంతపురం నగరంలో కీలకనేతగా ఎదిగారు. ఇంతకుముందు ఆయన యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
Next Story

