Mon Feb 02 2026 06:12:47 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్: జయరాం హత్య కేసులో కీలక పరిణామం
పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును ఇప్పటివరకు విచారించిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసును తెలంగాణకు బదిలీ చేయాలని నిర్ణయించారు. [more]
పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును ఇప్పటివరకు విచారించిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసును తెలంగాణకు బదిలీ చేయాలని నిర్ణయించారు. [more]

పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును ఇప్పటివరకు విచారించిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసును తెలంగాణకు బదిలీ చేయాలని నిర్ణయించారు. జయరాంను నిందితుడు రాకేష్ రెడ్డి హైదరాబాద్ లోనే హత్య చేసినందున ఇక్కడే విచారించాలని నిబంధనలు చెబుతున్నాయి. ఇక, జయరాం భార్య పద్మశ్రీ సైతం తనకు ఏపీ పోలీసులపై నమ్మకం లేదని, తెలంగాణ పోలీసులే కేసును దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు ఆమె తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులను సైతం కలిసి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.
Next Story