Sun Mar 15 2026 11:26:22 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : జైలు నుంచి శశికళ విడుదల
జయలలిత సన్నిహితురాలు శశికళ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ మేరకు జైళ్ల శాఖ అధికారిక పత్రాన్ని విడుదల చేసింది. శశికళ అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల నుంచి బెంగళూరులోని [more]
జయలలిత సన్నిహితురాలు శశికళ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ మేరకు జైళ్ల శాఖ అధికారిక పత్రాన్ని విడుదల చేసింది. శశికళ అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల నుంచి బెంగళూరులోని [more]

జయలలిత సన్నిహితురాలు శశికళ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ మేరకు జైళ్ల శాఖ అధికారిక పత్రాన్ని విడుదల చేసింది. శశికళ అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల నుంచి బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. సత్ప్రవర్తన కారణంగా ఈరోజు శశికళను విడుదల చేసినట్లు జైళ్లశాఖ తెలిపింది. అయితే శశికళకు కరోనా సోకడంతో ఆమె ప్రస్తుతం విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొద్ది రోజుల పాటు చికిత్స తీసుకుని ఫిబ్రవరి మొదటి వారంలో శశికళ చెన్నై వస్తారని తెలుస్తోంది.
Next Story