Fri Mar 20 2026 05:13:23 GMT+0530 (India Standard Time)
జనతా కర్ఫ్యూ సూపర్ సక్సెస్
తెలంగాణలో జనతా కర్ఫ్యూ సూపర్ సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి. మధ్యాహ్నం 12 గంటల వరకూ ఒక్కరూ ఇంటి నుంచి బయటకు రాకుండా స్వీయనిర్భంధాన్ని పాటించారు. ప్రధానంగా హైదరాబాద్ [more]
తెలంగాణలో జనతా కర్ఫ్యూ సూపర్ సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి. మధ్యాహ్నం 12 గంటల వరకూ ఒక్కరూ ఇంటి నుంచి బయటకు రాకుండా స్వీయనిర్భంధాన్ని పాటించారు. ప్రధానంగా హైదరాబాద్ [more]

తెలంగాణలో జనతా కర్ఫ్యూ సూపర్ సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి. మధ్యాహ్నం 12 గంటల వరకూ ఒక్కరూ ఇంటి నుంచి బయటకు రాకుండా స్వీయనిర్భంధాన్ని పాటించారు. ప్రధానంగా హైదరాబాద్ నగరం రోడ్లన్నీ బోసి పోయి కన్పిస్తున్నాయి. దుకాణాలు, హోటళ్లు అన్నీ బంద్ కావడంతో రోడ్డు మీద జనసంచారం కన్పించడం లేదు. ఎవరికి వారే కరోనా బారి నుంచి కాపాడుకోవటానికి ఇళ్లలోనే ఉండిపోయారు. ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమయిపోయారు. ప్రధాని నరేంద్రమోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది.
Next Story