Sun Mar 15 2026 15:43:45 GMT+0530 (India Standard Time)
తిరుపతి అభ్యర్థి ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు
తిరుపతి అభ్యర్థిని ఇంకా నిర్ణయించలేదని జనసేన పార్టీ తెలిపింది. బీజేపీ అభ్యర్థి బరిలో ఉంటారన్న సోము వీర్రాజు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని అభిప్రాయపడింది. తిరుపతి పార్లమెంటు ఉప [more]
తిరుపతి అభ్యర్థిని ఇంకా నిర్ణయించలేదని జనసేన పార్టీ తెలిపింది. బీజేపీ అభ్యర్థి బరిలో ఉంటారన్న సోము వీర్రాజు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని అభిప్రాయపడింది. తిరుపతి పార్లమెంటు ఉప [more]

తిరుపతి అభ్యర్థిని ఇంకా నిర్ణయించలేదని జనసేన పార్టీ తెలిపింది. బీజేపీ అభ్యర్థి బరిలో ఉంటారన్న సోము వీర్రాజు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని అభిప్రాయపడింది. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో అభ్యర్థి ఎవరనేది జేపీ నడ్డా, పవన్ కల్యాణ్ లు నిర్ణయిస్తారని జనసేన పార్టీ తెలిపింది. అయితే జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బరిలో ఉంటారని జనసేన తెలిపింది. ఇటీవల బీజేపీ అభ్యర్థి బరిలో ఉంటారని సోము వీర్రాజు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఇప్పుడు జనసేన ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story