Sun Mar 15 2026 20:33:01 GMT+0530 (India Standard Time)
కాకినాడలో టెన్షన్ టెన్షన్
కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జనసేన పార్టీ ఆందోళనకు దిగింది. వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఇంటి [more]
కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జనసేన పార్టీ ఆందోళనకు దిగింది. వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఇంటి [more]

కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జనసేన పార్టీ ఆందోళనకు దిగింది. వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చింది. ద్వారంపూడి నిన్న జరిగిన ఒక సభలో పవన్ కల్యాణ్ పట్ల మాట్లాడిన తీరును జనసేన కార్యకర్తలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇప్పటికే చంద్రశేఖర్ రెడ్డిపై పోలీసు కేసు నమోదు చేసిన జనసైనికులు ధర్నాకు దిగారు. కాకినాడలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. చంద్రశేఖర్ రెడ్డి క్షమాపణ చెప్పాలని జనసైనికులు డిమాండ్ చేస్తున్నారు.
Next Story