Wed Jan 28 2026 19:15:47 GMT+0000 (Coordinated Universal Time)
బీజేపీ వల్లే ఓటమి పాలయ్యాం… జనసేన నేత విమర్శలు
విజయవాడ కార్పొరేషన్ లో బీజేపీ నేతలు సహకరించక పోవడం వల్లనే జనసేన అనేక చోట్ల ఓటమి పాలయిందని ఆ పార్టీ నేత పోతిన మహేష్ అన్నారు. ఆయన [more]
విజయవాడ కార్పొరేషన్ లో బీజేపీ నేతలు సహకరించక పోవడం వల్లనే జనసేన అనేక చోట్ల ఓటమి పాలయిందని ఆ పార్టీ నేత పోతిన మహేష్ అన్నారు. ఆయన [more]

విజయవాడ కార్పొరేషన్ లో బీజేపీ నేతలు సహకరించక పోవడం వల్లనే జనసేన అనేక చోట్ల ఓటమి పాలయిందని ఆ పార్టీ నేత పోతిన మహేష్ అన్నారు. ఆయన అమరావతి పరిరక్షణ సమితి పైన కూడా ఆరోపణలు చేశారు. అమరావతి రాజధాని కోసం ఉద్యమం చేస్తున్న వారు ఈ ఎన్నికలకు ఎందుకు దూరంగా ఉన్నారని పోతిన మహేష్ ప్రశ్నించారు. బీజేపీ నేతలు సహరించక పోవడం వల్లనే తాము అనేక వార్డుల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యామన్నారు. బీజేపీతో కలసి వెళ్లడంతో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు తమను వ్యతిరేకించారని పోతిన మహేష్ విరమర్శించారు. దీనిపై పవన్ కల్యాణ్ కు లేఖ రాయనున్నట్లు ఆయన తెలిపారు.
Next Story

