Mon Mar 23 2026 02:03:49 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : జనసేన కవాతుకి ఆటంకం

జనసేన పార్టీ రాజమండ్రి దవళేశ్వరం బ్యారేజ్ పై నిర్వహించాలని అనుకుంటున్న కవాతుకు ఆదిలోనే బ్రేక్ పడింది. కవాతుకు, బహిరంగ సభకు దవళేశ్వరం బ్యారేజ్ అనుకూలం కాదని పోలీసులు నిర్ణయించారు. దీంతో కవాతుకు అనుమతిని నిరాకరిస్తూ జనసేన నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బ్యారేజీ పిట్టగోడలు బలహీనంగా ఉన్నాయని, కవాతుకు 10 వేలకు మించి జనం వస్తే బ్రిడ్జ్ ప్రమాదకరంగా మారుతుందని పోలీసులు నిర్ణయించారు. దవళేశ్వరం బ్యారేజ్ వద్ద బహిరంగ సభకు కూడా 10 వేల కంటే ఎక్కువ మంది వస్తే సహాస్థలి సరిపోదని పోలీసులు స్పష్టం చేశారు. సభను మరోచోటకు మార్చుకోవాలని పోలీసులు నేతలకు సూచిస్తున్నారు.
Next Story

