Sat Jan 31 2026 17:03:16 GMT+0000 (Coordinated Universal Time)
జనసేన గూటికి మాజీ క్రికెటర్

విశాఖపట్నానికి చెందిన భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు యాలక వేణుగోపాల్ రావు జనసేన పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకు స్వయంగా పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ... 2019 ఎన్నికల్లో తప్పకుండా జనసేన అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వేణుగోపాల్ రావు 2005లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో భారత్ తరుపున అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసి 2006లో వెస్టిండీస్ తో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. మొత్తం 16 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడి 218 పరుగులు చేశారు. ఐపీఎల్ లో ఢిల్లీ, హైదరాబాద్ జట్ల తరుపున కొన్ని రోజులు ఆడారు.
Next Story

