Tue Dec 16 2025 16:20:21 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ "వారాహి" సిద్ధం.. ఇదిగో బస్సు
రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. అందుకోసం ఆయన ప్రయాణించే వాహనం సిద్ధమయింది.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటించనున్నారు. అందుకోసం ఆయన ప్రయాణించే వాహనం సిద్ధమయింది. ప్రత్యేకంగా తయారయిన వాహనాన్ని పవన్ కల్యాణ్ స్వయంగా పరిశీలించారు. అన్ని అత్యాధునిక సౌకర్యాలతో ఈ వాహనాన్ని రూపొందించారు. వాహనం మీద నుంచే ప్రసంగించేలా ఏర్పాట్లు చేశారు. వాహనం ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా పటిష్టంగా తయారు చేశారు.
ఆర్మీ వాహనం తరహాలో...
ఆర్మీ వాహనంతో పోలిన ఈ బస్సుకు జనసేన వారాహి అని నామకరణం చేసింది. ఒకసారి బస్సులోకి ఎక్కితే ఇక ఆరోజు యాత్ర ముగిసేంత వరకూ బస్సు దిగాల్సిన అవసరం ఉండదు. వాహనం చుట్టూ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసుకునేలా బస్సును తయారు చేశారు. గత కొద్ది నెలలుగా శ్రమించి ప్రత్యేకంగా ఈ వాహనాన్ని రూపొందించారు. అన్ని హంగులతో రూపొందించిన ఈ వాహనంలోనే పవన్ కల్యాణ్ ఏపీ మొత్తం పర్యటించనున్నారు.
త్వరలో తేదీ ప్రకటన...
నిజానికి పవన్ కల్యాణ్ దసరా పండగ తర్వాత రోజు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సి ఉంది. కానీ నియోజకవర్గాల సమీక్షలు చేసి, అన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసిన తర్వాతనే బస్సు యాత్ర చేయాలని నిర్ణయించుకుని వాయిదా వేసుకున్నారు. బస్సు యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇంకా తేదీలు ఖరారు కానప్పటికీ త్వరలోనే తేదీలను ప్రకటిస్తారంటున్నారు. ఈ బస్సును పవన్ కల్యాణ్ స్వయంగా పరిశీలించారు. కొన్ని మార్పులు సూచించారని తెలిసింది. పవన్ యాత్రకు బయలుదేరే నాటికి వాహనం సిద్ధంగా ఉండాలన్న లక్ష్యంతో జనసేన ఈ వాహనాన్ని రూపొందించింది.
- Tags
- pawan kalyan
- bus
Next Story

