Sun Mar 16 2025 07:19:34 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ ఏం చెప్తారో….?
అమరావతిలో నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ఆయన రాజధాని అమరావతిలో జరిగిన నిర్మాణాలను, నిలిచిపోయిన పనులను పరిశీలిస్తారు. ఇటీవల రాజధాని రైతులు పవన్ కల్యాణ్ [more]
అమరావతిలో నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ఆయన రాజధాని అమరావతిలో జరిగిన నిర్మాణాలను, నిలిచిపోయిన పనులను పరిశీలిస్తారు. ఇటీవల రాజధాని రైతులు పవన్ కల్యాణ్ [more]

అమరావతిలో నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ఆయన రాజధాని అమరావతిలో జరిగిన నిర్మాణాలను, నిలిచిపోయిన పనులను పరిశీలిస్తారు. ఇటీవల రాజధాని రైతులు పవన్ కల్యాణ్ ను కలసి నప్పుడు తాను 30వ తేదీ అమరావతిలో పర్యటిస్తానని చెప్పారు. ఈరోజు ఉదయం పది గంటలకు పవన్ కల్యాణ్ పర్యటన అమరావతిలో ఉండనుంది. ఆయన యర్రబాలెం, నవులూరు, మంగళగిరి, కృష్ణాయపాలెం, తుళ్లూరు, ఐనవోలు, శాఖమూరు, అనంతవరం, దొండపాడు, రాయపూడి ప్రాంతాల్లో పర్యటిస్తారు. రైతులతో సమావేశం కానున్నారు. రాజధానిపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాకపోవడంతో పవన్ కల్యాణ్ పర్యటనపై ఆసక్తి నెలకొంది.
Next Story