Tue Dec 30 2025 04:21:50 GMT+0000 (Coordinated Universal Time)
అంతర్వేది ఘటనకు నిరసనగా ఇంట్లోనే పవన్ దీక్ష
అంతర్వేది సంఘటనకు నిరసనగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధర్మ పరిరక్షణ దీక్షకు దిగారు. హైదరాబాద్ లో తన నివాసంలో దీక్షకు దిగారు. అంతర్వేది లో రధం [more]
అంతర్వేది సంఘటనకు నిరసనగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధర్మ పరిరక్షణ దీక్షకు దిగారు. హైదరాబాద్ లో తన నివాసంలో దీక్షకు దిగారు. అంతర్వేది లో రధం [more]

అంతర్వేది సంఘటనకు నిరసనగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధర్మ పరిరక్షణ దీక్షకు దిగారు. హైదరాబాద్ లో తన నివాసంలో దీక్షకు దిగారు. అంతర్వేది లో రధం దగ్దం ఘటనపై బీజేపీ, జనసేన కలసి నేడు దీక్షలు చేయాలని పిలుపునిచ్చాయి. హైదరాబాద్ లో పవన్ కల్యాణ్, రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో సోము వీర్రాజు, ఢిల్లీలో జీవీఎల్ నరసింహారావులు దీక్షలు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం, భీమవరం, నెల్లూరులో కూడా ఇలాంటి సంఘటనలే జరిగాయని సోము వీర్రాజు అన్నారు. అంతర్వేది సంఘటనపై జ్యుడిషయల్ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని సోము వీర్రాజు చెప్పారు.
Next Story