Sat Mar 21 2026 20:53:55 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఆ నిబంధన మాకొద్దు

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి, ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డి సోమవారం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఈ ఎన్నికల్లో తనతో పాటు తన కుమారుడికి కూడా టిక్కెట్ ఇవ్వాలని రాహుల్ గాంధీని జానారెడ్డి కోరారు. అయితే, పార్టీలో ఉన్న ‘ఒక కుటుంబానికి ఒకే సీటు’ నిబంధన నుంచి తమను మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. రెండు సీట్లనూ తాము గెలిస్తామని ధీమా వ్యక్తం చేశారు. జానారెడ్డి ఈసారి కుమారుడిని మిర్యాలగూడ లేదా తన సిట్టింగ్ స్థానమైన నాగార్జున సాగర్ నుంచి అసెంబ్లీ బరిలో దింపాలని భావిస్తున్నారు.
Next Story

