Thu Mar 19 2026 12:04:08 GMT+0530 (India Standard Time)
టీడీపీతో కలవను.. పవన్ క్లారిటీ
పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీలతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని చెప్పారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తిరుపతిలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేసే విధంగా ఉన్నాయి. తాము వచ్చే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీలతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని ఆయన తేల్చి చెప్పారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ ప్రత్యామ్నాయ పార్టీలు కావాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. రెండు చోట్ల మూడో ప్రత్యామ్నాయం కావాలని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్దారు. రాష్ట్రంలో వైసీపీతో కాని, టీడీపీతోకాని కలసి వెళ్లేందుకు సిద్ధంగా లేమని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
ఎవరికీ భయపడను...
ప్రజారాజ్యం పార్టీ ఇప్పుడు ఉండి ఉంటే ప్రత్యామ్నాయంగా ఉండేదన్నారు. కానీ కొందరు వైఎస్ కుటుంబం కోవర్టుల కారణంగా ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారన్నారు. తాను ఎవరికీ భయపడనని చెప్పారు. తన ఆస్తులు లాక్కున్నా సరే తాను ప్రజల కోసం నిలబడతానని పవన్ కల్యాణ్ తెలిపారు. విధ్వంసక పాలన కొనసాగుతున్నప్పుడు తాను ప్రజల కోసం అవసరమైతే ప్రత్యర్థులతో అయినా చేతులు కలుపుతానని పవన్ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.
Next Story

