Tue Mar 24 2026 04:39:47 GMT+0530 (India Standard Time)
జగన్ కు జలీల్ లేటెస్ట్ సవాల్

విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీని జగన్ విమర్శిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాకుండా జగన్ కాళ్లు పట్టుకోడానికైనా తాను రెడీ అని జలీల్ అన్నారు. మోడీని పన్నెత్తు మాట అనకుండా నాలుగేళ్ల నుంచి నెట్టుకొస్తున్న జగన్ అవకాశ వాద రాజకీయాలకు పాల్పడుతున్నారని చెప్పుకొచ్చారు. కేవలం కేసుల కోసమే భయపడి జగన్ మోడీని మోసుకొస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రత్యేక హోదా వస్తే ఆదాయపు పన్ను కట్టనవసరం లేదని చెబుతున్న జగన్ కు ఎంత మాత్రం అవగాహన లేదన్నారు. ఆయన ముఖ్మమంత్రి పదవికి అనర్హుడన్నారు జలీల్ ఖాన్.
Next Story

