Tue Mar 17 2026 20:01:23 GMT+0530 (India Standard Time)
ఓటమి భయంతోనే అరెస్టులు..!

ఓటమి భయంతోనే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయించారని కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్.జైపాల్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రేవంత్ రెడ్డిని అరెస్టు చేసిన పద్ధతి సరికాదన్నారు. రేపు కేసీఆర్ కూతురి బెడ్ రూంలోకి పోలీసులు ఇలానే వస్తే కేసీఆర్ ఊరుకుంటారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అభ్యర్థులను కేసీఆర్ వేధిస్తున్నారని, కేసీఆర్ సభ ఉంటే రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. ఏదైనా సమస్య వస్తుందనుకుంటే హౌజ్ అరెస్ట్ చేస్తే సరిపోతుందని, కానీ బలవంతంగా అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ప్రభుత్వానికి కొందరు ఎన్నికల అధికారులు తొత్తులుగా పనిచేస్తున్నారని, వారి తీరుపై సీఈసీకి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.
Next Story

