Sun Mar 29 2026 14:22:20 GMT+0530 (India Standard Time)
కేసీఆర్ ను తిట్టడం వృధా

కేసీఆర్ ఇక తిట్టడం వృధా అని కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ పక్షాన నిలబడినప్పుడు ఆయన నిందించి ప్రయోజనమేంటని ఆయన ప్రశ్నించారు. ఈ ఐదేళ్లూ తన నియోజకవర్గం అభివృద్ధి పైనే దృష్టి పెడతానన్నారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్, మంత్రులను కూడా కలుస్తానని ఆయన చెప్పారు. తనను పులి అనుకున్నా...పిల్లి అనుకున్నా ఫరవాలేదని, కేసీఆర్ ను ఇక తిట్టి ప్రయోజనం లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. వారం రోజుల ముందు అభ్యర్థులను ప్రకటించడాన్ని ఇకనైనా కాంగ్రెస్ పార్టీ మానుకోవాలని జగ్గారెడ్డి హితవు పలికారు.
Next Story

