Tue Mar 24 2026 13:41:57 GMT+0530 (India Standard Time)
చంద్రబాబుకు జగన్ తాజా సవాల్ ఇదే

అన్నమాట ప్రకారం వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారని, దమ్ముంటే టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలని చంద్రబాబుకు జగన్ సవాల్ విసిరారు. ప్రత్యేక హోదా పై చిత్తశుద్ధి ఉంటే తమతో కలిసి రావాలని జగన్ కోరారు. అందరూ ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగివస్తుందన్నారు. ప్రత్యేక హోదా వల్ల యువత భవిత బాగుపడుతుందన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే రెండో అఖిలపక్ష సమావేశానికి హాజరు కాకూడదని వైసీపీ నిర్ణయించింది. ఫిరాయింపులు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలతో అఖిలపక్షం నిర్వహిస్తే తామెలా హాజరవుతామని వైసీపీ ప్రశ్నిస్తోంది. తాము ఎప్పటినుంచో హోదా కోసం పోరాడుతుంటే, మధ్యలో వచ్చి అఖిలపక్షమంటూ అధికార పార్టీ డ్రామా చేస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. చంద్రబాబు నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి అర్థం లేదన్నారు వైసీపీ నేతలు.
Next Story

