Thu Apr 02 2026 15:37:02 GMT+0530 (India Standard Time)
పాత మంత్రులకు ఈరోజే గుడ్ న్యూస్
తనకు నమ్మకమైన నేతలకు జగన్ జిల్లాల బాధ్యతలను అప్పగిస్తారంటున్నారు. మూడు జిల్లాలకు కో -ఆర్డినేటర్లను నియమించనున్నారు

మంత్రి వర్గ విస్తరణ రేపు జరగబోతుంది. ఎవరిని బయటకు పంపుతారు? ఎవరిని కేబినెట్ లో కొనసాగిస్తారు? అన్నది పక్కన పెడితే తనకు నమ్మకమైన నేతలకు మాత్రం జిల్లాల బాధ్యతలను జగన్ అప్పగిస్తారంటున్నారు. జిల్లాకు ఇన్ ఛార్జి ఒకరు, మూడు జిల్లాలకు కో -ఆర్డినేటర్లను నియమించనున్నారు. వీరికి ఈ రెండేళ్లు పార్టీ విషయంలో జగన్ ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. మంత్రి వర్గంలోకి తీసుకోలేని పాత మంత్రులకు రీజినల్ కమిటీ బాధ్యతలను జగన్ అప్పగిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పాత మంత్రులకు ఈ పార్టీ బాధ్యతలను అప్పగించనున్నారు. ఈరోజు ఆ ప్రకటన కూడా విడుదలయ్యే అవకాశముంది.
పీకే టీంతో...
నియోకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేసిన తర్వాత వారికి అవసరమైన ఆర్థిక, ప్రచారం సాయాన్ని కూడా వీరు దగ్గరుండి అందించాలి. ప్రశాంత్ కిషోర్ టీం అందించే సలహాలు, సూచనలను వీరు అమలు చేయాల్సి ఉంటుంది. పీకే టీంతో వీరు మాత్రమే టచ్ లో ఉండేలా జగన్ నిర్ణయం తీసుకున్నారట. జిల్లాల్లో బలహీనంగా ఉన్న నియోజకవర్గాలను గుర్తించి ఎప్పటికప్పుడు హైకమాండ్ కు నివేదిక ఇవ్వడం కూడా వీరిపనే.
యువకులే.....
మంత్రివర్గ విస్తరణలో సీనియర్లకు కొందరికి అవకాశముందంటున్నారు. గత కేబినెట్ లో ఉన్నవారిలో ఎక్కువ మంది యువకులే ఉన్నారు. వారికి మూడేళ్లు మంత్రి పదవి అవకాశం కల్పించడంతో వారంతా పార్టీ కోసం నిబద్దతో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వాస్తవ విషయాలను హైకమాండ్ కు వీరయితేనే చేరవేస్తారు. అందుకే మంత్రి వర్గ విస్తరణ తర్వాత ఎవరికి పార్టీ బాధ్యతలను అప్పగిస్తారన్న దానిపై క్లారిటీ రానుంది.
వారికే పూర్తి బాధ్యత....
ఆ జిల్లాల్లో వైసీపీని గెలుపు బాట పట్టించాల్సిన బాధ్యత వీరిదే. వైసీపీ అధికారంలోకి వస్తే పనితీరును బట్టి వారికి తిరిగి మంత్రివర్గంలో చోటు దక్కుతుంది. ఆ విషయాన్ని కూడా జగన్ స్పష్టం చేయడంతో మంత్రి పదవిలో కొనసాగించకపోయినా వీరంతా పార్టీ పదవుల్లో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు. ఇప్పటి వరకూ జగన్ కు వన్ సైడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది. ఎన్నికల సమయంలో రెండు, మూడు మార్గాల ద్వారా సమాచారాన్ని తెప్పించుకుని ఎన్నికలలో గెలించేందుకు అవసరమైన వ్యూహాలను పన్నేందుకు వీలు చిక్కుతుందంటున్నారు.
Next Story

