కొత్త జిల్లాల ఏర్పాటు సంగతి ఏమో కాని అధికార వైసీపీలో మాత్రం ఇప్పుడు పదవుల జ్వరం పట్టుకుంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి 151 మంది ఎమ్మెల్యేలు గెలవడంతో ఏ జిల్లాలో చూసినా వారిదే ఆధిపత్యం. దాదాపు అన్ని నియజకవర్గాల్లో వారిదే పైచేయి. అయితే ఇదే సమయంలో కొత్త జిల్లాల ప్రకారమే రాబోయే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈసారి మంత్రి వర్గ విస్తరణలో జగన్ కొత్త జిల్లాల ప్రాతిపదికనే ఇస్తారని అంటున్నారు.
అన్నమయ్య జిల్లాలో....
ీదీంతో కొందరు నేతలు ఖుషీ గా ఉంగా మరికొందరు పోటీ ఎక్కువగా ఉంది. ఇందులో ప్రస్తుత చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డికి అదృష్టమో, దురదృష్టమో చెప్పలేం. కడప జిల్లా నుంచి బయటకు వెళ్లినందుకు ఆయనకు ఆనందంగానే ఉండి ఉండవచ్చు. రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పడింది. కడప జిల్లాలో ఉన్నప్పుడు అక్కడ ముఖ్యమంత్రి జగన్ పులివెందుల నుంచి ఉన్నారు. మైనారిటీ కోటా కింద అంజాద్ భాషాకు అప్పగించారు.
కడపలో ఉంటే?
కడప జిల్లాలోనే ఉంటే జగన్ ముఖ్యమంత్రిగా ఉంటారు కాబట్టి మరో రెడ్డి సామాజికవర్గం నేతకు మంత్రి పదవి దక్కే అవకాశం లేదు. అయితే ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తునన రాయచోటి అన్నమయ్య జిల్లాలోకి వచ్చేసింది. కొత్తగా ఏర్పడబోయే అన్నమయ్య జిల్లాలో తంబళ్లపల్లి, రాయచోటి, మదనపల్లి, పీలేరు, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాలున్నాయి. అయితే ఇక్కడ కూడా శ్రీకాంత్ రెడ్డికి మనశ్శాంతి లేదనే చెప్పాలి. వరసగా రెండు జిల్లాల్లోనూ రెడ్డి సామాజికవర్గానికి మంత్రి పదవులు దక్కే అవకాశం లేదు. ఇటు కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు వరసగా రెడ్డి సామాజికవర్గానికి పదవులు ఇచ్చే ఛాన్స్ లేదు.
ఇక్కడకు వచ్చినా...?
అన్నమయ్య జిల్లాలోనూ వైసీపీలో సీనియర్ నేతలున్నారు. మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలున్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి గెలిచిన కోరుముట్ల శ్రీనివాసులు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. శ్రీకాంత్ రెడ్డి లాగే జగన్ ను నమ్ముకున్న వ్యక్తి. పైగా ఎస్సీ. ఎస్సీ కోటా కింద ఆయన దక్కించుకునే చాన్స్ ఉంది. ఇక పీలేరు నుంచి రెండుసార్లు గెలిచిన చింతల రామచంద్రారెడ్డి కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఆయన కూడా రెండుసార్లు గెలిచారు. దీంతో శ్రీకాంత్ రెడ్డి జిల్లా మారినా ఫేట్ మారుతుందా? లేదా? అన్న డౌట్ లోనే ఉన్నారట.