Tue Mar 24 2026 07:30:54 GMT+0530 (India Standard Time)
మోడీపై జగన్ ట్వీట్ ఇదే

ప్రత్యేకహోదాను ఇస్తామన్న మాటను నిలబెట్టుకోవాలని ప్రధాని మోడీని వైసీపీ అధినేత జగన్ కోరారు. ఎంపీల జీవితాలు, ఏపీ భవిష్యత్ ఆందోళనలో ఉన్నాయని, హోదాపై మీరు చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకోవాలని జగన్ కోరారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలోని ఏపీ భవన్ లో తమ పార్టీకి చెందిన ఐదు గురు ఎంపీలు ఆమరణ దీక్షకు దిగగా, అందులో మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్ లను ఇప్పటికే ఆస్పత్రికి పోలీసులు తరలించారని, తమ ఎంపీల ఆమరణ దీక్ష నాలుగో రోజు చేరిందని, ఇప్పటికైనా ఏపీకి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మోడీని ట్విటర్లో జగన్ కోరారు.
Next Story

