Sat Jan 31 2026 12:57:38 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ ట్వీట్ వారికి ఫేవర్ గా...!

తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్చకులకు పదవీ విరమణ వయసు వివాదంపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ స్పందించారు. అర్చకులకు పదవీవిరమణ వయస్సు నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదని, శక్తి ఉన్నంత కాలం దేవుడికి సేవ చేసే హక్కు అనువంశీకులకు ఉందన్నారు. టీటీడీలో అవినీతి, అక్రమాలు, ఆగమశాస్త్ర ఉల్లంఘనలపై ప్రశ్నిస్తే ఇలా కక్షసాధింపు చర్యలకు పాల్పడటం సరికాదన్నారు. దశాబ్దాలుగా ఏ పాలకులు చేయని పనిని ఇప్పుడు చేస్తున్నారనన్నారు. వైఎస్సాఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పదవీ విరమణ నిబంధనను తొలగిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఆయన ట్వీట్ చేశారు.
Next Story

