Sat Dec 06 2025 02:12:44 GMT+0000 (Coordinated Universal Time)
ఆయనను ఎవరూ ఏమీ అనలేదు.. దేవుడు చూస్తున్నాడు
చంద్రబాబు పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, అందుకే ఇటువంటి శపథాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ అన్నారు

చంద్రబాబు పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, అందుకే ఇటువంటి శపథాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యుల ప్రస్తావన సభలో రాలేదన్నారు. సభలో రికార్డులు చూసుకోవచ్చన్నారు. దేవుడు అన్నీ చూస్తారన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పేపర్లు తనకు తోడుగా ఉండకపోవచ్చని, అబద్ధాలు నిజం చేసేందుకు వీళ్లు ప్రయత్నిస్తున్నారన్నారు. వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో ఉండటా సభలో ప్రస్తావించారని జగన్ అన్నారు.
వివేకా హత్య గురించి....
తమ సభ్యులు కూడా ఎన్టీఆర్, వంగవీటి మోహన రంగా అంశాలను మాట్లాడాలని పట్టుబట్టారు తప్పించి, చంద్రబాబు కుటుంబ సభ్యుల ప్రస్తావన తీసుకురాలేదన్నారు. కుప్పంలో ఓడిపోయి చంద్రబాబు ఫ్రస్టేషన్ లో ఉన్నారని జగన్ అన్నారు. రాజకీయంగా వాడుకోవడానికి చంద్రబాబు ఇలాంటివి వాడుతున్నారు. కానీ దుదరృష్టమని, దేవుడే నిజానిజాలను ప్రజలకు తెలియజేస్తాడని జగన్ అన్నారు.
- Tags
- chandra babu
- tdp
Next Story

