Mon Mar 23 2026 15:26:20 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : హత్యాయత్నంపై స్పందించిన జగన్

తనపై జరిగిన దాడి పట్ల ఎవరూ ఆందోళన చెందవద్దని, ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నానని ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. భగవంతుడి దయ, కోట్లాది మంది ప్రజల ప్రేమ, ఆశీస్సులే తనను రక్షించాయన్నారు. ఇటువంటి పిరికిపంద చర్యలు తన ఆత్మవిశ్వాసాన్ని, లక్ష్యాన్ని దెబ్బ తీయలేవని, ప్రజా సంక్షేమం కోసం తాను చేసే పోరాటాలను ఆపలేవన్నారు. ఈ మేరకు హత్యాయత్నం తర్వాత జగన్ మొదటిసారి ఈ ఘటనపై స్పందిస్తూ ట్వీట్ చేశారు.
Next Story

