Mon Mar 23 2026 14:48:38 GMT+0530 (India Standard Time)
జగన్ ఎలా చెబితే అలా

ఈ నెల29న వైసీపీలోకి రాయలసీమ నేత, పాణ్యం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి చేరబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తన నియోజకవర్గ కార్యకర్తలు, ముఖ్య అనుచరులతో వివిధ స్థాయుల్లో సమావేశాలు నిర్వహించానని, అందరూ ముక్త కంఠంతో వైసీపీలో చేరాల్సిందిగా సూచించారని రాంభూపాల్ రెడ్డి తెలిపారు. అయితే తాను పాణ్యం నియోజకవర్గం టిక్కెట్ ను ఆశించడం లేదని, వైఎస్ జగన్ ఏది చెబితే అది చేస్తానని రాంభూపాల్ రెడ్డి తెలిపారు. ఈ నెల29వ తేదీన గుడివాడ-పామర్రు మధ్య పాదయాత్ర చేస్తున్న జగన్ సమక్షంలో తాను పార్టీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు.
Next Story

