Tue Mar 24 2026 12:03:01 GMT+0530 (India Standard Time)
పవన్ కు సినిమా తక్కువ...ఇంటర్వెల్ ఎక్కువ

పవన్ కల్యాణ్ ఏ ఉద్యమం చేసినా మంచిదేనన్నారు. ఇదే పవన్ కల్యాణ్ నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం ఏ కార్యక్రమాలు చేశారని నిలదీశారు. పవన్ ఆరు నెలలకు ఒకసారి బయటకు వచ్చి ఒక ట్వీట్, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడమో, చంద్రబాబుకు అవసరం వచ్చినప్పుడు బయటకు వచ్చి వెళ్లిపోతారన్నారు. వపన్ విషయంలో సినిమా తక్కువ... ఇంటర్వల్ ఎక్కువ అని జగన్ ఎద్దేవా చేశారు. 2014 లో ఇదే పవన్ కల్యాణ్ బీజేపీకి, బాబుకు ఓటేయమని చెప్పి రాష్ట్రాన్ని ముంచాడా? లేదా? అని ప్రశ్నించారు. ఇదే పవన్ కల్యాణ్ ఇప్పుడు బాబు, బీజేపీ ముంచారని ఇప్పుడు చెబుతున్నారన్నారు. రాష్ట్రాన్ని ముంచడంలో పవన్ పాత్ర కూడా ఉందన్నారు. నాలుగు రోజుల క్రితమే కదా? పవన్ కల్యాణ్ బయటకొచ్చింది అని జగన్ అన్నారు.
Next Story

