Wed Mar 25 2026 01:50:11 GMT+0530 (India Standard Time)
జగన్ పాదయాత్రకు ఊహించని స్థాయిలో భద్రత

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. జగన్ పై విశాఖపట్నం ఎయిర్ పోర్టులో హత్యాయత్నం ఘటనతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. పాదయాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 150 మంది పోలీసులతో జగన్ చుట్టూ మూఢంచెల భద్రత ఏర్పాటు చేశారు. వీరికి అదనంగా 50 మంది జగన్ వ్యక్తిగత సిబ్బంది భద్రత చూసుకుంటున్నారు. 50 మంది సిబ్బంది బాడీ కెమెరాలతో పాదయాత్రను కవర్ చేస్తున్నారు. పాదయాత్ర రూట్ మొత్తం డ్రోన్ కెమెరాలతో పరిశీలించే ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్ బస చేసే క్యాంపు చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జగన్ పాదయాత్ర విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది.
Next Story

