Mon Mar 23 2026 23:12:06 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : పాదయాత్ర మొదలయ్యేది అప్పుడే..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్రకు వచ్చే నెల 2 వరకు విరామం ఇచ్చారు. విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ఆయనపై హత్యాయత్నం జరగడం. ఎడమ చేతికి గాయం కావడం తెలిసిన విషయమే. గాయం లోతుగా ఉండటం... పాదయాత్రలో ప్రజలకు అభివాదం చేస్తే గాయం త్వరగా మానదనే ఉద్దేశ్యంతో వైద్యులు కనీసం వారం పాటు విశ్రాంతి తీసుకోవాలని జగన్ కు సూచించారు. దీంతో పాదయాత్రకు నవంబరు 2 వరకు విరామం ఇచ్చి... తిరిగి 3వ తేదీ నుంచి తిరిగి ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ నేత తలశిల రఘురాం తెలిపారు.
Next Story

