Mon Feb 02 2026 06:26:29 GMT+0000 (Coordinated Universal Time)
పెద్దాపురం చేరిన జగన్ పాదయాత్ర

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర 220వ రోజుకు చేరుకుంది. తూర్పు గోదావరి జల్లా పెద్దాపురం నియోజకవర్గంలోని సామర్లకోట ప్రసన్నాంజనేయ నగర్ నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్రకు పెద్ద ఎత్తున ప్రజలు, జగన్ అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ, పకలరిస్తూ జగన్ ముందుకుపోతున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. పెద్దాపురం పట్టణంలోని బ్యాంక్ కాలనీ, మున్సిపల్ సెంటర్, పాత బస్టాండ్ సెంటర్, మరిడమ్మ తల్లి గుడి, వేముల వారి సెంటర్, దర్గా సెంటర్ ప్రాంతాల మీదుగా జగన్ పాదయాత్ర కొనసాగనుంది. సాయంత్రం పెద్దాపురం వేముల వారి సెంటర్ లో నిర్వహించే బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు.
Next Story

