Fri Mar 20 2026 13:27:07 GMT+0530 (India Standard Time)
జగన్ తో కలిసి నడుస్తా

తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత మోత్కుపల్లి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు రాజ్యసభ స్థానాలను అమ్ముకున్నారని, బ్రోతల్ హౌజ్ కంటే దారుణంగా పార్టీని నడుపుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబును నమ్మి తాను మోసపోయానని, చివరి వరకు పార్టీలో ఉండాలనుకుంటే తనను బహిష్కరించారన్నారు. దళితులుగా ఎవరు పుట్టాలనుకుంటారని చంద్రబాబు నీచమైన వ్యాఖ్యలు చేశారన్నారు. జగన్ కుటుంబంలో నలుగురు దళితులను పెళ్లి చేసుకున్నారని గుర్తు చేశారు. త్వరలోనే వైఎస్ జగన్ పాదయాత్రలో పాల్గొని, ఆయనతో కలిసి నడుస్తానని, పవన్ ను కూడా కలుస్తానన్నారు.
Next Story

