Tue Mar 24 2026 06:07:08 GMT+0530 (India Standard Time)
పాదయాత్రను ముగించి జగన్.....?

వైసీపీఅధినేత జగన్ గురువారం మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ బయలుదేరారు. ప్రస్తుతం జగన్ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. అయితే శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరుకావాల్సి ఉండటంతో జగన్ మధ్యాహ్నమే పాదయాత్రను ముగించి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది. రేపు సీబీఐ కోర్టులో హాజరయిన అనంతరం యధావిధిగా శనివారం నుంచి ప్రజాసంకల్ప పాదయాత్ర ఉంటుంది.
Next Story

