Wed Mar 18 2026 17:28:42 GMT+0530 (India Standard Time)
జగన్ పాదయాత్రకు బ్రేక్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు మంగళవారం బ్రేక్ పడింది. తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గంలో ఆయన 210 రోజు పాదయాత్ర జరగాల్సి ఉంది. అయితే, ఉదయం నుంచే వర్షం కురుస్తుండటంతో పాదయాత్రకు ఆటంకం కలిగింది. మంగళవారం పాదయాత్ర మండపేట నియోజకవర్గం రాయవరం నుంచి ప్రారంభమై అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలంలోని కొమరిపాలెం, తొస్సిపపుడి క్రాస్, పండలపాక, ఉలపల్లి గ్రామాల్లో జరగాల్సి ఉంది. అయితే, వర్షం తగ్గితే మధ్యాహ్నం తర్వాత ఆయన పాదయాత్ర కొనసాగించే అవకాశం ఉంది.
Next Story

